Mumbai: రోజుకొకటిగా వెలుగు చూస్తున్న సచిన్‌వాజే లీలలు

Mumbai: ముకేశ్‌ అంబానీ ఇంటి దగ్గర కార్‌ బాంబు కేసులో అరెస్టయిన సచిన్‌ వాజే గురించి విస్తుగొలిపే వార్తలు వినిపిస్తున్నాయి.

Arun Chilukuri
Updated on: 23 March 2021 9:16 PM IST
Sachin Vaze Stayed at 5-star Hotel Using Fake Aadhaar card
X

Mumbai: రోజుకొకటిగా వెలుగు చూస్తున్న సచిన్‌వాజే లీలలు

Mumbai: ముకేశ్‌ అంబానీ ఇంటి దగ్గర కార్‌ బాంబు కేసులో అరెస్టయిన సచిన్‌ వాజే గురించి విస్తుగొలిపే వార్తలు వినిపిస్తున్నాయి. మున్సుఖ్ హిరేన్ వాహనం కనిపించకుండా పోయిన ముందు రోజు సచిన్ వాజే నకిలీ ఆధార్ కార్డుతో ముంబైలోని ఓ ఖరీదైన హోటల్‌లో దిగినట్టు తెలుస్తోంది. నకిలీ ఆధార్ కార్డులో సచిన్ వాజే తన పేరును సుశాంత్ సదాశివ్ ఖమ్కార్‌గా చూపించాడు. ఫోటో మాత్రం వాజేదే ఉంది. ఖరీదైన నారిమన్ పాయింట్ హోటల్‌లో సచిన్ ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు ఉన్నాడు. జాతీయ దర్యాప్తు సంస్థ తాజాగా ఆ హోటల్‌ను సందర్శించి సచిన్ ఉన్న గదిని క్షుణ్ణంగా తనిఖీ చేసింది. అయితే, ఆ హోటల్‌లో ఉండేందుకు సచిన్ నకిలీ ఐడీ ఎందుకు ఉపయోగించాడనేది తెలియాల్సి ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story