Sachin Pilot Phone call to Chidambaram: చిదంబరానికి సచిన్ పైలట్ ఫోన్..

Sachin Pilot Phone call to Chidambaram: కాంగ్రెస్ అగ్ర నాయకత్వం సచిన్ పైలట్‌ను శాంతింపజేసి తిరిగి పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించింది.

admin1
Updated on: 17 July 2020 11:24 AM IST
Sachin Pilot Phone call to Chidambaram: చిదంబరానికి సచిన్ పైలట్ ఫోన్..
X
Congress Leader Chidambaram (File Photo)

Sachin Pilot Phone call to Chidambaram: కాంగ్రెస్ అగ్ర నాయకత్వం సచిన్ పైలట్‌ను శాంతింపజేసి తిరిగి పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభించింది, గురువారం రాత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ హోమ్ శాఖా మంత్రి పి చిదంబరం సచిన్ పైలట్ తో ఫోన్ సంభాషణలో మాట్లాడి తిరుగుబాటు మరచిపోవాలని కోరారు. తనకు, తన వర్గం ఎమ్మెల్యేలకు అనర్హత నోటీసులు ఇచ్చారని. నోటీసులకు వ్యతిరేకంగా రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించిన తరువాత, సచిన్ పైలట్ గురువారం చిదంబరంకు ఫోన్ చేసి తన సలహా తీసుకున్నారు.

తనను పీసీసీ చీఫ్, డిప్యూటీ ముఖ్యమంత్రి పదవుల నుంచి తొలగించిన తరువాత, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో శాశ్వత సభ్యుడైన చిదంబరంతో మాట్లాడటం ఇప్పుడు కొత్త చర్చకు దారి తీసింది. సచిన్ తనతో మాట్లాడిన విషయాన్ని స్వయంగా చిదంబరం వెల్లడించారు.. ఈ సందర్బంగా కూర్చుని మాట్లాడుకుంటే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని.. పార్టీలో ఉంటే మంచి భవిశ్యత్ ఉంటుందని సలహా ఇచ్చారు. సచిన్ మరియు తన ఎమ్మెల్యేల శిబిరం చేసిన తిరుగుబాటు వలన రాజకీయ భవిషత్ నాశనం అవుతుందని అన్నారు.

ఇదిలావుండగా, సచిన్ ను తిరిగి గౌరవంగా పార్టీలోకి ఆహ్వానించాలని కాంగ్రెస్ భావిస్తోందని, ఎప్పుడు వెనక్కు రావాలన్న విషయాన్ని సచిన్ పైలటే తేల్చుకోవాలని కాంగ్రెస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్న సంగతి తెలిసిందే.

admin1

admin1

Next Story