శబరిమల ఆలయంలో భక్తులకు నో ఎంట్రీ

Arun Chilukuri
Updated on: 11 Jun 2020 6:12 PM IST
శబరిమల ఆలయంలో భక్తులకు నో ఎంట్రీ
X

శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప ఆలయ ద‌ర్శ‌నంపై ట్రావన్‌కోర్‌ దేవస్థానం బోర్డు కీలక ప్రకటన చేసింది. కరోనా నేపథ్యంలో భక్తుల నెలవారీ పూజల కోసం ఆలయాన్ని తెరువకూడదని నిర్ణయించింది. అలాగే ఆలయ ఉత్సవాన్ని కూడా రద్దు చేసింది. గురువారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు కేరళ దేవాదాయ శాఖ మంత్రి కదకంపల్లి సురేంద్రన్ మీడియాకు తెలిపారు.

అయితే, ఆలయంలో సాధారణంగా జరిగే పూజలు మాత్రం కొనసాగుతాయని తెలిపారు. కాగా, శబరిమల ఆలయాన్ని ఈ నెల 14న సాయంత్రం నెలపూజ కోసం తెరుస్తామని, 19న ఆలయ పండుగ ప్రారంభం అవుతుందని ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ఎన్ వాసు బుధవారం తెలిపారు. అంతలోనే వాటిని రద్దు చేస్తున్నట్టు మంత్రి ప్రకటించడం గమనార్హం.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story