శబరిమలలో తెరుచుకున్న అయ్యప్ప సన్నిధానం.. ఇవాళ్టి నుంచి స్వామివారి దర్శనానికి భక్తులకు అనుమతి

Arun Chilukuri
Published on: 16 Nov 2020 10:03 AM IST
శబరిమలలో తెరుచుకున్న అయ్యప్ప సన్నిధానం.. ఇవాళ్టి నుంచి స్వామివారి దర్శనానికి భక్తులకు అనుమతి
X

కేరళలోని ప్రముఖ శబరిమల ఆలయం ఆదివారం తెరుచుకున్నది. ఇవాళ్టి నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. శబరిమలలో నేటి నుంచి డిసెంబర్ 26 వరకు మండల పూజలు జరగనున్నవి. కరోనా నేపథ్యంలో అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చేభక్తులు తప్పనిసరిగా పాటించాల్సిన నియమ నిబంధనలను ట్రావెన్‌కోర్ బోర్డు గైడ్ లెైన్స్ విడుదల చేసింది. వర్చువల్ క్యూలో రిజిస్టర్ చేసుకోని భక్తులను అనుమతించరు. వారంలో ఐదు రోజులపాటు ప్రతి రోజూ వెయ్యి మంది భక్తుల్ని మాత్రమే అనుమతిస్తారు. శనివారం, ఆదివారం రెండు వేల మందిని చొప్పున భక్తుల్ని అనుమతిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story