Shabarimala: తెరుచుకున్న శబరిమల ఆలయం...నలభైఒక్క రోజుల పాటు మండల పూజ

* భక్తలు భారీ ఎత్తున రానుండటంతో అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

R Tripura Malini
Published on: 17 Nov 2022 6:46 AM IST
Sabarimala temple opened
X

తెరుచుకున్న శబరిమల ఆలయం

Swamiye Sharanam Ayyappa: శబరిమల ఆలయం బుధవారం తెరుచుకుంది. మండల పూజల కోసం ఆలయాన్ని ఆలయ ప్రధాన అర్చకుడి ఆధ్వర్యంలో తెరిచారు. భక్తులు ఆన్‌లైన్ లేదా స్పాట్ బుకింగ్ పద్ధతిలో దర్శనానికి దరఖాస్తు చేసుకోవాలి. 41 రోజుల పాటు జరిగే మండల పూజ డిసెంబర్ 27న ముగుస్తుంది. మధ్యలో విరామం ఇచ్చి డిసెంబర్ 30న మకరవిలక్కు కోసం ఆలయాన్ని మళ్లీ తెరుస్తారు. భక్తలు భారీ ఎత్తున రానుండటంతో అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తోపులాటలతో పాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అధునాతన సాంకేతికతతో భక్తుల రాకపోకలపై నిఘా ఉంచనున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story