శబరిమలలో హై అలర్ట్... అనూహ్య ఘటనతో ఆందోళన

శబరిమలలో హై అలర్ట్... అనూహ్య ఘటనతో ఆందోళన
x
Highlights

శబరిమలలో దేవస్థాన ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చిన మర్నాడే మరో ముగ్గురు పోలీసులకు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని తేలింది. ఆ ముగ్గురు పోలీసుల్లో ఒకరు...

శబరిమలలో దేవస్థాన ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చిన మర్నాడే మరో ముగ్గురు పోలీసులకు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని తేలింది. ఆ ముగ్గురు పోలీసుల్లో ఒకరు దేవస్థానంలోని సన్నిధానంలో డ్యూటీ చేస్తుండగా ఇద్దరు పంపా దగ్గర విధులు నిర్వహిస్తున్నారు. ఈ ముగ్గురికీ కరోనా పాజిటివ్ అని తేలడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. సన్నిధానం, పంపాతోపాటూ నీలక్కల్ దగ్గర హై అలర్ట్ అమలు చేస్తన్నారు. తాజా పరిణామంపై ట్రావెన్ కోర్ దేవస్థాన బోర్డు, ఆరోగ్య విభాగం, పోలీసులు, రెవెన్యూ అధికారులతో కూడిన జాయింట్ టాస్క్ ఫోర్స్ పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులకు, ఆలయ పరిసరాల్లో డ్యూటీలో ఉన్న అందరికీ థర్మల్ స్కానింగ్ చేస్తున్నట్లు దేవస్థాన కార్యనిర్వహణ అధికారి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.

భక్తులు, ఆలయ సిబ్బందిని అన్ని ఎంట్రీ పాయింట్ల దగ్గరా థర్మల్ స్కానర్లతో చెక్ చేస్తున్నారు. స్టాఫ్ గేట్, మాలికప్పురం టెంపుల్ గేట్, దేవస్థాన మెస్ గేట్, ఆన్నదాన మండపం అన్ని చోట్లా థెర్మల్ స్క్రీనింగ్ జరుగుతోందని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. దేవస్థాన ఉద్యోగులు, తాత్కాలిక వర్కర్లు, ప్రభుత్వ ఉద్యోగులు అందర్నీ పరిశీలిస్తున్నామన్న ఆయన ఎవరికైనా లక్షణాలు ఉంటే టెస్టులకు పంపుతామని చెప్పారు. ఇందుకోసం దగ్గర్లోనే ప్రభుత్వ ఆస్పత్రి ఉంది. అక్కడ కరోనా టెస్టింగ్ సదుపాయం ఉంది.

కౌంటర్ల దగ్గర దేవస్థాన ఉద్యోగులందరూ ఫేస్ షీల్డులు వాడాలని, ఉద్యోగులంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని రాజేంద్ర ప్రసాద్ ఆదేశించారు. నీలక్కల్ భక్తుల క్యాంపు దగ్గర మరిన్ని కరోనా టెస్టింగ్ సదుపాయాలు అందుబాటులోకి తెచ్చామన్నారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా నీలక్కల్ ట్రాన్సిట్ క్యాంప్ దగ్గర అదనపు బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ భక్తులు రాత్రివేళ ఉండేందుకు సదుపాయాలున్నాయి. అలాగే దర్శనానికి వెళ్లేముందు స్నానం చేసేందుకు సదుపాయాలున్నాయి. ఇక్కడ కరోనా సోకకుండా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్ని చేసినా కరోనా కేసులు బయటపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories