Sabarimala: నేడు తెరుచుకోనున్న శబరిమల ఆలయం

*తులామాసం పూజల కోసం తెరుచుకోనున్న అయ్యప్ప ఆలయం *ఆదివారం నుంచి భక్తులకు అనుమతి

Shilpa
Published on: 16 Oct 2021 9:44 AM IST
Sabarimala Ayyappa Temple in Kerala will be Opened Today 16 10 2021
X

నేడు తెరుచుకోనున్న శబరిమల ఆలయం(ఫైల్ ఫోటో)

Sabarimala: కేరళలోని శబరిమల ఆలయం తెరుచుకోనుంది. తులా మాసం పూజల కోసం సాయంత్రం 5గంటలకు ట్రావెన్‌‌కోర్ బోర్డు అయప్ప ఆలయాన్ని తెవరనుంది. ఇక ఆదివారం నుంచి ఈనెల 21 వరకు అయప్ప ఆలయంలోకి భక్తులను అనుమతిస్తారు. రేపు డ్రా పద్ధతిలో శబరిమల ఆలయ ప్రధాన పూజారిని ఎంపిక చేస్తారు. ఇక అయ్యప్పను దర్శించుకునేందుకు వచ్చే భక్తులను వర్చువల్ బుకింగ్ ద్వారానే అనుమతిస్తారు. కొవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తైన సర్టిఫికెట్ లేదా కొవిడ్ నెగిటివ్ రిపోర్టు తప్పనిసరిగా చూపించాలని ఆలయ అధికారులు తెలిపారు. ఇక 21న శబరిమల ఆలయాన్ని ట్రావెన్ కోర్ బోర్డు మూసివేయనుంది. మళ్లీ నవబంర్ 2న ఆలయాన్ని తెరుస్తారు.

Shilpa

Shilpa

Next Story