Putin: రేపు భారత్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్‌

Putin: రేపు, ఎల్లుండి రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌ పర్యటించనున్నారు. పుతిన్‌ తన పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతో భేటీ కానున్నారు.

Arun Chilukuri
Published on: 3 Dec 2025 12:11 PM IST
Putin: రేపు భారత్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్‌
X

Putin: రేపు భారత్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్‌

Putin: రేపు, ఎల్లుండి రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌ పర్యటించనున్నారు. పుతిన్‌ తన పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. వాణిజ్యం, రక్షణ రంగాల్లో పలు ఒప్పందాలకు వారు శ్రీకారం చుట్టనున్నారు. అమెరికాతో సంబంధాలు దెబ్బతిన్న ఈ తరుణంలో పుతిన్‌ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. రష్యా, చైనా, భారత్‌ బంధాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని ఇప్పటికే పుతిన్‌ తెలిపారు.

రెలోస్‌ ఒప్పందంలో భాగంగా రెండు దేశాల మధ్య సైనిక నిర్మాణాలు, యుద్ధ నౌకలు, యుద్ధ విమానాల పరస్పర మార్పిడి ఉంటుంది. బలగాల పంపిణీలోనే కాకుండా పరికరాలు, రవాణానూ రెలోస్‌ నియంత్రిస్తుంది. ఈ ఏర్పాటును సంయుక్త విన్యాసాలు, శిక్షణ, మానవతా సాయం, విపత్తుల సమయంలో వినియోగిస్తారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story