Vladimir Putin: ఇవాళ భారత్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్‌

Vladimir Putin: ఇవాళ రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ కు రానున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా పుతిన్.. ప్రధాని మోడీతో భేటీ కానున్నారు.

Arun Chilukuri
Published on: 4 Dec 2025 11:15 AM IST
Vladimir Putin: ఇవాళ భారత్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్‌
X

Vladimir Putin: ఇవాళ భారత్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్‌

Vladimir Putin: ఇవాళ రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ కు రానున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా పుతిన్.. ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. వాణిజ్యం, రక్షణ రంగాలపై చర్చించి పలు ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. అమెరికాతో సంబంధాలు దెబ్బతినడంతో పుతిన్ భారత పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. పుతిన్ పర్యటన నేపథ్యంలో భారత ప్రభుత్వం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఐదంచెల భద్రతా వలయాన్ని సిద్ధం చేసింది. నేషనల్ సెక్యురిటీ గార్డ్ నుంచి అగ్రశ్రేణి కమాండోలు, స్నైపర్లు, డ్రోన్లు, జామర్లను వినియోగించున్నారు. ఏఐ సాయంతో భద్రతను పర్యవేక్షించనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story