Delhi Liqour Scam: అరుణ్ పిళ్లై కేసులో రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు.. మరో మూడ్రోజులు..

Delhi Liqour Scam: కీలక సమయంలో పిళ్లై వాంగ్మూలం ఉపసంహరించుకున్నారు

Dhatripriya
Published on: 13 March 2023 3:57 PM IST
Rouse Avenue Court Judgment In Arun Pillai Case
X

Delhi Liqour Scam: అరుణ్ పిళ్లై కేసులో రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు.. మరో మూడ్రోజులు..

Delhi Liqour Scam: అరుణ్ పిళ్లై కేసులో కాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇవ్వనుంది. మరో మూడ్రోజుల పాటు కస్టడీ పొడిగించాలని ఈడీ కోరింది. కీలక సమయంలో పిళ్లై వాంగ్మూలం ఉపసంహరించుకున్నారని ఈడీ కోర్టుకు తెలిపింది. బలమైన వ్యక్తికి తాము నోటీసులిచ్చినప్పుడే... పిళ్లై తన స్టేట్మెంట్‌ మార్చుకున్నారని వెల్లడించింది. విచారణ సమయంలో పిళ్లైని భయపెట్టలేదని ఈడీ అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 18, 2022న పిళ్లై స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశామని.. సెకండ్, థర్డ్‌ స్టేట్‌మెంట్లలో కూడా పిళ్లై ఆ వివరాలు కన్ఫార్మ్ చేశారని ఈడీ పేర్కొంది. పిళ్లై, బుచ్చిబాబు లిక్కర్ పాలసీ రూపకల్పనలో భాగస్వాములుగా ఈడీ కోర్టుకు వివరించింది.

Dhatripriya

Dhatripriya

Next Story