Dussehra: రోబోల ఆయుధ పూజ..

Dussehra: భవిష్యత్తులో మానవ దైనందిన కార్యక్రమాల్లో రోబోల ప్రాతినిధ్యం పెరగనుంది.

Arun Chilukuri
Updated on: 4 Oct 2022 8:31 PM IST
Robot Doing Ayudha Pooja in VIT
X

Dussehra: రోబోల ఆయుధ పూజ..

Dussehra: భవిష్యత్తులో మానవ దైనందిన కార్యక్రమాల్లో రోబోల ప్రాతినిధ్యం పెరగనుంది. ఇప్పటికే శాస్త్ర సాంకేతిక రంగాల్లో రోబోలను వినియోగిస్తున్నారు. క్లిష్టమైన శస్త్రచికిత్సల్లోనూ రోబోలు సహకారం అందించడం తెలిసిందే. తమిళనాడులోని వెల్లూరు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజినీరింగ్ కాలేజీలో రోబోలు దసరా ఆయుధ పూజ నిర్వహించి అందరినీ ఆకట్టుకున్నాయి. వెల్లూరులోని వీఐటీకి దక్షిణాది రాష్ట్రాల్లో ఎంతో పేరుంది. తాజాగా రోబోల ఆయుధ పూజతో వీఐటీ మరోసారి వార్తల్లోకెక్కింది. ఒక రోబో గంట మోగిస్తుండగా, మరో రోబో అమ్మవారికి హారతి ఇచ్చింది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story