రోడ్లు కత్రినా బుగ్గల్లా ఉండాలి.. మంత్రి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

Roads Should be Made Like Katrina Kaif’s Cheeks, says Rajasthan Minister
x

రోడ్లు కత్రినా బుగ్గల్లా ఉండాలి.. మంత్రి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

Highlights

Rajasthan: రాజస్థాన్‌ మంత్రి, కాంగ్రెస్‌ నేత రాజేంద్ర సింగ్‌ గుడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Rajasthan: రాజస్థాన్‌ మంత్రి, కాంగ్రెస్‌ నేత రాజేంద్ర సింగ్‌ గుడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో రహదారులు కత్రినా కైఫ్‌ బుగ్గల్లా ఉండాలన్నారు. రహదారులను బాలీవుడ్‌ నటి కత్రినా కైఫ్‌ బుగ్గలతో పోల్చుతూ చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఝున్‌ఝును జిల్లా ఉడైపురవాటి ప్రాంతం ప్రజలతో రాజేంద్ర సింగ్‌ గుడా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయనతో తమ సమస్యలను చెప్పుకున్నారు ప్రజలు. ముఖ్యంగా రోడ్ల పరిస్థితిని వివరించిన ప్రజలు వాటిని బాగుచేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో మంత్రి రాజేంద్ర సింగ్‌ రోడ్లను కత్రినా కైఫ్‌ బుగ్గలతో పోల్చుతూ కామెంట్లు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories