పశ్చిమ బెంగాల్‌లో ఘోర ప్రమాదం: 13 మంది మృతి

* కారు, ఆటోపై బోల్తాపడ్డ ట్రక్కు * బండరాళ్ల లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు * జల్ఫాయ్‌గురి జిల్లాలోని ధుప్గురి దగ్గర ఘటన * ఓవర్‌లోడ్‌, పొగమంచు ప్రమాదానికి కారణం

K V D Varma
Published on: 20 Jan 2021 8:58 AM IST
పశ్చిమ బెంగాల్‌లో ఘోర ప్రమాదం: 13 మంది మృతి
X

పశ్చిమ బెంగాల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బండరాళ్ల లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు ఓ కారుతో పాటు ఆటోపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 13 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ విషాదకరణ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయిగుడి జిల్లా ధుప్‌గుడి వద్ద బుధవారం తెల్లవారు జామున జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా.. మరికొందరు గాయపడ్డారని స్థానిక ఎమ్మెల్యే మిథాలీ రాయ్‌ తెలిపారు.

ఈ ఘటనలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను జల్పాయిగుడిలోని హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఓవర్‌లోడ్‌, పొగమంచు కారణంగా ట్రక్కు అదుపు తప్పి పక్కనే వెళ్తున్న వాహనాలపై బోల్తాపడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. బండరాళ్లు వాహనాలపై పడడంతో భారీగా దెబ్బతిన్నాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

K V D Varma

K V D Varma

Next Story