యూపీ ఘాటంపూర్‌లో విషాదచాయలు.. 26 మంది మృతి

Uttar Pradesh: గాయపడ్డ 24మందికి కొనసాగుతున్న చికిత్స.. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు..

Jyothi
Updated on: 2 Oct 2022 12:21 PM IST
Road Accident In Uttar Pradesh
X

యూపీ ఘాటంపూర్‌లో విషాదచాయలు.. 26 మంది మృతి

Uttar Pradesh: యూపీలోని కాన్పూర్‌జిల్లా ఘాటంపూర్‌లో విషాద చాయలు అలుముకున్నాయి. దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తూ ట్రాక్టర్‌ ట్రాలీ బోల్తా పడిన ఘటనలో చనిపోయిన 26మంది మృత దేహాలు గ్రామానికి చేరుకున్నాయి. పోస్ట్‌మార్టం తర్వాత పోలీసులు మృతదేహాలను బంధువులకు అప్పగించారు. గ్రామస్తులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకేసారి 26 మంది అంత్యక్రియల ఏర్పాట్లతో గ్రామం మొత్తం ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. ఒకే కుటుంబంలో ఆరుమంది చనిపోయారు. కుటుంబ సభ్యుల రోదన వర్ణనాతీతంగా మారింది. గాయపడ్డ మరో 24మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోడీ మృతుల కుటుంబాలకు 2లక్షల రూపాయలు, గాయపడ్డవారికి 50వేల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

Jyothi

Jyothi

Next Story