Uttar Pradesh: ఉత్తర్‌ప్రదేశ్‌ ఘోర రోడ్డు ప్రమాదంలో 18 మంది మృతి

* బారాబంకి జిల్లా రాంస్నేహిఘాట్‌లో ప్రమాదం *డబుల్‌ డెక్కర్‌ బస్సును ఢీకొన్న ట్రక్కు *మృతులంతా బీహార్‌ వాసులుగా గుర్తింపు

Sandeep Reddy
Published on: 28 July 2021 8:18 AM IST
Road Accident in Uttar Pradesh 18 People Dead 15 Seriously Injured
X

రోడ్డు ప్రమాదం (ఫైల్ ఫోటో)

Uttar Pradesh: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బారాబంకి జిల్లా రాంస్నేహిఘాట్‌లో డబుల్‌ డెక్కర్‌ బస్సును ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో 18 మంది మృతి చెందగా మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు హుటాహుటిన క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతులంతా బీహార్‌ వాసులుగా గుర్తించారు. హరియాణా నుంచి బిహార్‌ వెళ్తుండగా లక్నో- అయోధ్య జాతీయ రహదారిపై అర్ధరాత్రి ప్రమాదం చోటుచేసుకుంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story