Kerala Road Accident: లోయలో పడిపోయిన జీపు.. 9 మంది మృతి

Kerala Road Accident: అదుపు తప్పి లోయలో పడిపోయిన జీపు

Shekhar G
Published on: 25 Aug 2023 7:37 PM IST
Road Accident In Kerala 9 Members Died
X

Kerala Road Accident: లోయలో పడిపోయిన జీపు.. 9 మంది మృతి

Kerala Road Accident: కేరళ, వయనాడ్‌ జిల్లాలోని మనంతవాడి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జీపు అదుపు తప్పి 25 అడుగుల లోతు లోయలో పడిపోయింది. ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్‌ సహా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మూల మలుపు వద్ద జీపు కంట్రోల్‌ కాకపోవడంతో ఎదురుగా ఉన్న లోయలోకి జీపు దూసుకుపోయి ప్రమాదం జరిగింది. తేయాకు తోటల్లో కూలీలుగా పని చేసే 11 మంది మహిళలు...

పని ముగించుకుని దీపు టీ ట్రేడింగ్‌ కంపెనీకి చెందిన జీపులో ఇళ్లకు బయలు దేరారు. మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో మనంతవాడి సమీపంలో జీపు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం మనంతవాడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా... మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. కాగా, ఘటనపై కేరళ సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం సానుభూతి తెలియజేశారు.

Shekhar G

Shekhar G

Next Story