Uttar Pradesh: కాన్పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Uttar Pradesh: బస్సు ఢీకొనడంతో 10 వాహనాలు ధ్వంసం

Rama Rao
Published on: 31 Jan 2022 7:51 AM IST
Road Accident in Kanpur Uttar Pradesh | National News
X

కాన్పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Uttar Pradesh: యూపీలోని కాన్ఫూర్‌లో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. బస్సు ఎదురుగా రావడంతో 10 వాహనాల వరకు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.

కాన్పూర్‌లోని క్లాక్‌ టవర్‌ నుంచి తత్మిల్‌ వైపు వేగంగా వేళ్తున్న బస్సు వంతెనపై నుంచి కిందికి రాగానే అదుపు తప్పింది. ముందు వస్తున్న ఆటోను, ఆ తరువాత రెండు కార్లు, రెండు బైకులు, స్కూటీని ఢీకొట్టింది. ఆ తరువాత ట్యాట్‌మిల్‌ సెంటర్‌లో సిగ్నల్‌ స్తంభాన్ని ఢీకొట్టి ట్రాఫిక్‌ బూత‌పై దూసుకెళ్లింది. బస్సు ఆగిపోయిన తరువాత డ్రైవర్‌ పరారయ్యాడు.

ఈ ఘటనలో మొత్తం ఆరుగురు మృతి చెందారు. తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అయితే బస్సు డ్రైవర్‌ మద్యం మత్తులో ఉన్నట్టు సమాచారం.

Rama Rao

Rama Rao

Next Story