జమ్ముకశ్మీర్‌లో ఘోర ప్రమాదం...10 మంది మృతి, నలుగురి పరిస్థితి విషమం..

Jammu Kashmir: మరో 20 మందికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు

Arun Chilukuri
Published on: 30 May 2023 12:18 PM IST
Road Accident in Jammu Kashmir
X

జమ్ముకశ్మీర్‌లో ఘోర ప్రమాదం...10 మంది మృతి, నలుగురి పరిస్థితి విషమం..

Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. వైష్ణో దేవీ యాత్రలో భాగంగా అమృత్‌సర్​నుంచి కాట్రా వెళుతున్న ఓ బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. జమ్ముకశ్మీర్‌లోని ఝజ్జార్‌ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వంతెనపై నుంచి బస్సు వెళుతుండగా ఒక్కసారిగా పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఘటనతో బస్సు నుజ్జునుజ్జు అయ్యింది. ప్రమాదంలో 10 మంది మృతి చెందగా 20మంది గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story