Haryana: హర్యానాలోని అంబాలాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన ట్రక్కు

Road Accident In Haryana
x

Haryana: హర్యానాలోని అంబాలాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన ట్రక్కు

Highlights

Haryana: ఆరుగురు మృతి, 10 మందికి తీవ్రగాయాలు

Haryana: హర్యానాలోని అంబాలాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అంబాలా వద్ద యమునా నగర్ - పంచకుల జాతీయ రహదారిపై ఓ బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ధాటికి బస్సు నుజ్జునుజ్జ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories