Rishi Sunak: అక్షర్‌ధామ్‌లో రిషి సునాక్‌ ప్రత్యేక పూజలు

Rishi Sunak: అక్షర్‌ధామ్‌లో రిషి సునాక్‌ ప్రత్యేక పూజలు

Jyothi
Published on: 10 Sept 2023 1:19 PM IST
Rishi Sunak, Akshata Murty Offer Prayers At Akshardham Temple
X

Rishi Sunak: అక్షర్‌ధామ్‌లో రిషి సునాక్‌ ప్రత్యేక పూజలు

Rishi Sunak: జీ-20 సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన బ్రిటన్ ప్రధాన మంత్రి రుషి సునాక్ సతీ సమేతంగా ఢిల్లీలోని అక్షరధామ్ దేవాలయంలో పూజలు చేశారు. రుషి సునాక్, అక్షత మూర్తి దంపతులు ఉదయం అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు. రుషి సునాక్ దంపతులు హిందూ సంప్రదాయాలను పాటిస్తూ, సనాతన సంప్రదాయంలో భగవంతుడిని దర్శించుకున్నారు. దేవాలయంలో సునాక్‌ సతీ సమేతంగా పూజలు చేసి., హారతి ఇచ్చారు.. దేవీదేవతలందరికీ పుష్పాలు సమర్పించారు.

చెప్పులు లేకుండా దేవాలయం ప్రాంగణంలో తిరుగుతూ సాధువులందరితోనూ సరదాగా మాట్లాడారు. దేవాలయంలోని ప్రతి అంశాన్నీ అడిగి తెలుసుకున్నారు. నిర్వాహకులు దేవాలయం నమూనాను రిషి దంపతులకు ఇచ్చారు. అవకాశం దొరికిన ప్రతిసారీ తాము ఈ దేవాలయాన్ని సందర్శిస్తామని సునాక్‌, అక్షత తెలిపారు. రుషి, అక్షత దంపతులు రావడానికి ముందే ఢిల్లీ పోలీసులు ఆలయ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Jyothi

Jyothi

Next Story