Review 2019 : యు ట్యూబ్ ను ఊపేసిన టాప్ ఛానెల్స్ ఇవే!

Review 2019 :  యు ట్యూబ్ ను ఊపేసిన టాప్ ఛానెల్స్ ఇవే!
x
Highlights

సోషల్ మీడియాలో యు ట్యూబ్ దారేవేరు. టీవీ సీరియల్స్ దగ్గర నుంచి సినిమాల వరకూ.. వీధి గొడవల నుంచి చట్టసభలలో సందడి వరకూ.. చెత్త నుంచి బంగారం వరకూ.. ఇలా...

సోషల్ మీడియాలో యు ట్యూబ్ దారేవేరు. టీవీ సీరియల్స్ దగ్గర నుంచి సినిమాల వరకూ.. వీధి గొడవల నుంచి చట్టసభలలో సందడి వరకూ.. చెత్త నుంచి బంగారం వరకూ.. ఇలా చెప్పుకుంటూ పొతే సమస్త విషయాలనూ వీడియోలుగా అందించడంలో ముందుంటుంది. పిల్లలకు పాటలతో పాఠాలు..యువకులకి వీడియోలతో విశేషాలు.. మహిళలకి ఫ్యాషన్ దగ్గర నుంచి వంటల విశేషాల వరకూ..

ఇలా చెప్పుకుంటూ పొతే సమస్త ప్రపంచాన్ని తనలో దాచుకుని పంచుతుంది. ఇప్పుడు యు ట్యూబ్ వినోదాల ప్రపంచమే సమాచార సంపద కూడా. అన్నివిధాల ఉపయోగపడుతున్న యు ట్యూబ్ లో ఈ సంవత్సరం టాప్ లో దూసుకుపోయిన కొన్ని చానెల్స్ ఇవే!

'టీ సిరీస్' టాప్!

12 కోట్ల మంది ఒక ఛానల్ చూశారంటే ఆ ఛానెల్ ఎలా వుంటుందో ఊహించండి. ఒక యు ట్యూబ్ ఛానెల్ ప్రపంచం లోనే అత్యధిక వీక్షకులను సాధించిన చానెల్ గా నిలిచింది. అదీ మన దేశానికి సంబంధించింది. అ ఛానెల్ టీ సిరీస్! 2006 లో ప్రారంభించిన ప్రారంభించిన ఈ ఛానెల్ తోలి రోజుల్లో సినిమా పాటలు, ఆడియో, ప్రే రిలీజ్‌ వేడుకలూ, టైలర్లూ వంటివి ప్రసారం చేసేది. తర్వాత క్రమంగా హిందీతోపాటు ఇంగ్లిష్‌, తెలుగు, తమిళం,

గుజరాతీ, మలయాళం, భోజ్‌పురి వంటి భాషల వీడియోలతో దూసుకుపోవడం ప్రారంభించింది. అటుపై ఫిట్‌నెస్‌, పిల్లల రైమ్స్‌, భక్తిగీతాలు వంటి పలు అంశాలతో 29 సబ్‌ఛానళ్లను ప్రారంభించింది. అన్ని చానళ్ళూ ప్రేక్షకాదరణ పొందడంతో ఈ ఏడాది 12.2 కోట్ల సబ్స్క్రైబర్స్ ను సంపాదించుకుని ప్రపంచస్థాయిలో నెంబర్ 1 యు ట్యూబ్ చానెల్ గా గిన్నిస్ బుక్ లోకి ఎక్కి చరిత్ర సృష్టించింది.

10.2కోట్ల వీక్షకుల 'ప్వూదెపై'

తొమ్మిదేళ్ల క్రితం స్వీడన్‌కు చెందిన ప్యూడిపై ప్రారంభం అయింది. ఈ చానెల్ ప్రస్తుతం 10.2 కోట్ల చందాదారులతో రెండో స్థానంలో నిలిచింది. కామెడీ, హారర్‌, యాక్షన్‌, ప్రత్యేకంగా రూపొందించిన వీడియోలూ, మ్యూజిక్‌ ఆల్బమ్‌ల వంటివి ఇందులో ఉంచుతారు.

దీనిని ప్రారంభించిన ముప్ఫై ఏళ్ల ఫెలిక్స్ కి అమ్మాయిల్లో సూపెర్ ఫాలోయింగ్‌ ఉంది. వీడియో గేమ్స్‌ ఆడి అందులో ఆటతీరును వివరిస్తూ అతను పెట్టే వీడియోల్ని పిల్లలు తెగ ఇష్టపడతారు. ఈ ఛానల్ ను అతను ఒక్కడే నడిపిస్తుండడం విశేషం. దాదాపు 8500 వీడియోలు పోస్టు చేసి రికార్డు సృష్టించాడితను.

6.680కోట్ల వీక్షకుల 'కోకోమిలన్‌'

పిల్లల కోసం ప్రత్యేకమైన యు ట్యూబ్ చానెల్ కోకోమిలన్! ఈ చానెల్ పిల్లలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పిల్లల కోసం ప్రత్యేకంగా ప్రారంభించ బడిన తొలి చానెల్ గా పేరు సంపాదించిన ఛానెల్ ఇది. ఇందులో త్రీడీ యానిమేషన్‌తో పిల్లలకు నీతి కథలు, రైమ్స్‌ నంబర్లు, రంగులు, ఆల్ఫాబెట్స్‌ వంటివి నేర్పించే వీడియోలెన్నో ఉంటాయి. ఈ యూట్యూబ్‌ఛానల్ డిస్నీ స్థాయిలో ఆదరణ పొంది మూడో స్థానంలో నిలిచింది.

6.29కోట్ల వీక్షకులతో '5 మినిట్‌ క్రాన్స్‌'

ష్యాకు చెందిన పావాల్ రాదే, మారత్ ముఖమేటేటోవ్ మూడేళ్ల క్రితం ప్రారంభించిన ఈ చానెల్ టాప్ నాలుగులో నిలిచింది. ఇందులో రకరకాల క్రాఫ్ట్ తయారీ, పనికి రాని వాటిని రీసైకిల్‌ చేయడం, రకరకాల పనిముట్లు, వంటింటి సామగ్రి, అందం, ఆరోగ్యం, జంతువులూ, మొక్కల పెంపకానికి సంబంధించిన మెలకువలు తెలిపే వీడియోలు ఉంటాయి. వాయిస్ ఓవర్ లేకుండా ఉండే వీడియోలు ఈ ఛానెల్ ప్రత్యేకం. వీరికి వీడియోలు తీయడానికి 550 మంది ఉన్నారు ఈ చానెల్ లో.

6.14కోట్ల వీక్షకులతో 'సెట్‌ ఇండియా'

సెట్‌ ఇండియా అంటే సోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ టెలివిజన్‌ పేరుకు కుదింపు. ఛానల్‌లో ప్రసారమయ్యే కార్యక్రమాల్నీ సెట్‌ ఇండియా వేదికగా యూట్యూబ్‌లో ఉంచుతోంది సోనీ. 2006లో ప్రారంభించిన సెట్‌ ఇండియాలో కపిల్‌ శర్మ షో, ఇండియన్‌ ఐడల్‌, నేరాలకు సంబంధించిన షో క్రైమ్‌ పెట్రోల్‌ కార్యక్రమాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షాకాదరణ పొందాయి. ఇక క్రికెట్, కబడ్డీ వంటి క్రీడల్నీ లైవ్‌లో ప్రసారం చేస్తూ అటు క్రీడాభిమానుల్నీతన సొంతం చేసుకుంది ఈ ఛానల్. పిల్లల నుంచి పెద్దల వరకూ అందర్నీ ఆకట్టుకున్న ఈ ఛానల్‌ హిందీతోపాటు ఇంగ్లిష్‌, తెలుగు, గుజరాతీ, మరారీల్లో వీడియోలు పెడుతూ అగ్రస్థానంలో ఉంటోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories