Review 2019 : అరకు కాఫీ..కుమారస్వామి పంచామృతం.. భౌగోళిక గుర్తిపుతో ప్రసిద్ధం!


భౌగోళిక గుర్తింపు(జీఐ) ఏఉత్పాదన కైనా దక్కిందంటే ఆ ఉత్పత్తి ప్రపంచ ప్రఖ్యాతి పొందినట్టే. ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుంచీ ఈ గుర్తింపు కోసం పలు...
భౌగోళిక గుర్తింపు(జీఐ) ఏఉత్పాదన కైనా దక్కిందంటే ఆ ఉత్పత్తి ప్రపంచ ప్రఖ్యాతి పొందినట్టే. ప్రతి సంవత్సరం ప్రపంచం నలుమూలల నుంచీ ఈ గుర్తింపు కోసం పలు ఉత్పత్తులు పోటీ పడతాయి. వాటిలో కొన్ని గుర్తింపు పొందుతాయి. ఈ సంవత్సరం మనదేశం నుంచి చాలా ఉత్పత్తులకు జీఐ గుర్తింపు దక్కింది. ఈ గుర్తింపుతో ఆయా వస్తువుల ఉత్పత్తిదారులకు ఆదాయ వనరులు పెరిగి.. వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి.
అరకు కాఫీ..
అరకు అందాలకు మైమర్చి పోనీ వారుండరు. అరకు వెళ్లిన ప్రతి ఒక్కరినీ పలకరించేది అక్కడి కాఫీ తోటలు. వాటి నుంచి ఉత్పత్తి అయ్యే కాఫీ ఒక్క సారి రుచి చూస్తే జీవితం అంతా గుర్తుండిపోతుంది. అంతలా మనల్ని ఆకట్టుకుంటుంది. కాఫీ అలవాటు లేని వాళ్లు కూడా అరకు కాఫీ సువాసనకు ఫిదా అయిపోయి కాఫీ ప్రియులు అయిపోతారు. అరకు అరబిక్ కాఫీ కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. పారిస్ లో అయితే ఏకంగా అరకు అరబిక్ కాఫీ పేరుతొ ఓ కాఫీ షాప్ నడుస్తోంది. ఇక దుబాయ్, స్విట్జర్లాండ్ వంటి దేశాలకు అరకు కాఫీ ఎగుమతి అవుతోంది. ఇంత అభిమానాన్ని సాధించిన అరకు కాఫీ కి ఈ సంవత్సరం ప్రపంచ గుర్తింపు లభించింది. జీఐ గుర్తింపు సాధించింది అరకు కాఫీ.
అరకు కాఫీ తో పాటు కర్ణాటకద చెందిన కూర్గ్ చిక్ మంగళూర్, బాబాబుదంగిరి ఆరబీక రకం, కేరళకు చెందిన వయనాడ్ రోబస్సా కాఫీలు కూడా తమదైన ప్రత్యేకతలతో జీఐ ట్యాగ్‌ను సంపాదించుకోగలిగాయి.
కుమారస్వామి పంచామృత ప్రసాదం..
జ్ఞానాన్ని ప్రసాదించే దేవునిగా ప్రజలు కొలిచే దండాయుధపాణి దివ్య క్షేత్రం పళని. ఇక్కడికి వెళ్లిన భక్తులకు ప్రసాదంగా ఇచ్చే పంచామృతాలు ఇప్పుడు ప్రపంచ ప్రసిద్ధి పొందడమే కాకుండా భౌగోళిక గుర్తింపు పొందింది.
ఆరటిపళ్ళు, తేనె, ఖర్జూరాలు, నెయ్యి, యాలకులు, వాటు సక్కరై(ఒకరకమైన బెల్లం), పటికబెల్లంతో చేసే ఈ పంచామృతం అమృతంలానే ఉంటుందంటారు కుమారస్వామి భక్తజనకోటి! ప్రిజ్‌లో పెట్టకపోయినా మూడునెలలపొటు అదే రుచీ, సువాసనలతో నిల్వ ఉండటం ఈ ప్రసాదం ప్రత్యేకత.
కండాంగి చేనేత..
ఇప్పటికే దేశ విదేశాల్లో ప్రత్యేకమైన అభిమానులను సొంతం చేసుకున్నాయి కండాంగి చేనేత చీరలు. తమిళనాడులోని కండాంగిలో ఈ చీరలు చేత్తో నేస్తారు. ఇప్పుడు ఈ చీరలు జియోగ్రాఫికల్ ఇండికేషన్ దక్కించుకున్నాయి.
తమిళనాడు తాళాలు..
తాళాల తయారీకి ప్రసిద్ధి చెందిన తమిళనాడు లోని దిండిగల్‌కు 'లాక్ సిటీ 'అనే పేరు ఉంది. ఇక్కడ తయారయ్యే తొంభై రకాల తాళాలు విదేశాలకూ ఎగుమతి జరుగుతాయి. వీటికి ఈ సంవత్సరం జీఐ గుర్తింపు దక్కింది. దీంతో ఆ తాళాలు తాయారు చేసే కార్మికులకు మరింత మంచి జరగబోతోంది.
కేరళ మరయూర్ బెల్లం..
మరయూర్ బెల్లం ఎటువంటి రసాయనాలు వాడకుండా తయారు చేస్తారు. దీనిలో ఐరన్ మోతాదు ఎక్కువ, సోడియం మోతాదు తక్కువ ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. ఈ బెల్లం ఇప్పుడు జియో ఐడెంటిఫికేషన్ సాధించింది.
ఇక ఇవే కాకుండా తమిళనాడు-ఈరోడ్, ఒడిశా కంఛమల్ జిల్లాల్లో పెద్ద ఎత్తున పండే పసుపు, ఒడిశా రసగుల్లా, కేరళ తమలపాకులూ, వక్కలూ, కర్ణాటక లోని సీర్ఫిలో పండే వక్కలూ, మహారాష్ట్రలో ఫేమస్ అయిన కొల్లాపూర్ చెప్పులూ, ఈశాన్య రాష్ట్రం మిజోరంలో నడుముకు చుట్టుకునే షాల్‌లాంటి వస్త్రం, రాజస్ట్రాన్‌లోనీ భీయురియా ప్రాంతంలో తయారయ్యే స్వేటూ, హిమాచల్ ప్రదేశ్‌లో పండే నల్ల జీలకర్ర, ఆప్రికాట్ నూనె ఇవన్నీ కూడా భౌగోళిక గుర్తింపు పొందాయి ఈ సంవత్సరం.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire

