Republic day: తెలంగాణాలో గణతంత్ర వేడుకలు

Sandeep Eggoju
Updated on: 26 Jan 2021 10:50 AM IST
Republic day celebrations in India
X

flag hoisting (file Image)

తెలంగాణాలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జెండా ఆవిష్కరణలతో త్రివర్ణ పతకం రెపరెపలాడుతోంది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా మువ్వెన్నెల జెండా రెపరెపలాడింది. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు, పార్టీ కార్యాలయాల్లో జెండాను ఎగురవేసి జెండా గీతాన్ని ఆలపించారు.

తెలంగాణ పబ్లిక్‌ గార్డెన్‌లో...

ఇటు తెలంగాణలో పబ్లిక్‌ గార్డెన్‌లో గణతంత్ర వేడుకలు జరగనున్నాయి. గవర్నర్ తమిళసై సౌందరాజన్ పాల్గొన్ని జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన పరేడ్ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు.

తెలంగాణ బీజేపీ ఆఫీస్‌లో...

తెలంగాణ బీజేపీ ఆఫీస్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. టీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.

తెలంగాణ అసెంబ్లీలో...

తెలంగాణ అసెంబ్లీలో 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. అసెంబ్లీ ఆవరణలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.. జెండాను ఆవిష్కరించారు. అనంతరం గాంధీ విగ్రహానికి, అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు.

Live Updates

  • 26 Jan 2021 10:50 AM IST

    తెలంగాణ భవన్‌లో గణతంత్ర వేడుకలు

    తెలంగాణ భవన్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ భవన్‌లో పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, ఎగ్గే మల్లేశం పాల్గొన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story