Narendra Modi: పార్లమెంటరీ పార్టీ భేటీలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

Narendra Modi: బీజేపీలో వారసత్వ రాజకీయాలు ఉండవు-ప్రధాని మోడీ

Rama Rao
Updated on: 15 March 2022 12:30 PM IST
Remarks Made by PM Modi at the Parliamentary Party Conference
X

పార్లమెంటరీ పార్టీ భేటీలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

Narendra Modi: బీజేపీలో వారసత్వ రాజకీయాలు ఉండవని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. నేతల కుమారులు, కుమార్తెలకు టిక్కెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఉదయం అంబేదర్కర్ ఇంటర్నేషనల్ ‌సెంటర్‌లో జరిగిన పార్లమెంటరీ పార్టీ భేటీలో పాల్గొన్న మోడీ మంత్రులు, ఎంపీలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ఇతర రాజకీయ పార్టీల్లో ఉన్న వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాలని ఎంపీలకు సూచించారు. బీజేపీలో ఉన్న ఏస్థాయి నేత వారసుడైనా సాధారణ కార్యకర్తగానే పనిచేయాలని మోడీ సూచించారు. పార్టీ అభివృద్ధికి వారు చేసిన కృషి ఆధారంగా, వారి సామర్ధ్యం ఆధారంగానే అవకాశాలు ఉంటాయని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.

Rama Rao

Rama Rao

Next Story