సుప్రీంకోర్టులో ఎంపీ నవనీత్ రానాకు ఊరట
Maharashtra: నవనీత్ కుల ధృవీకరణ పత్రాన్ని సమర్థించిన సుప్రీం
సుప్రీంకోర్టులో ఎంపీ నవనీత్ రానాకు ఊరట
Maharashtra: మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ రాణాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. నవనీత్ కుల ధ్రువీకరణ పత్రాన్ని సమర్థిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. 2019లో ఎస్సీ కేటగిరిలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు నవనీత్ రాణా. అయితే ఆమె ఎస్సీ సర్టిఫికెట్‌ను చట్ట విరుద్ధంగా పొందారనే కారణంతో దాన్ని బాంబే హైకోర్టు రద్దు చేసింది. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ముంబై హైకోర్టు ఉత్తర్వులు సుప్రీంకోర్టు పక్కనపెట్టింది. కాగా ఇటీవలే ఆమె బీజేపీలో కూడా చేరారు.
Next Story




