Mukesh Ambani: ముకేష్ అంబానీ కారు ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. ఎంతంటే..?

Mukesh Ambani: ముకేష్ అంబానీ కారు ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. ఎంతంటే..?

Rama Rao
Updated on: 7 Feb 2022 12:01 PM IST
Reliance Industries owner Mukesh Ambanis car is priced at Rs 13.14 crore
X

Mukesh Ambani: ముకేష్ అంబానీ కారు ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. ఎంతంటే..?

Mukesh Ambani: రిలయన్స్‌ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ కొత్తగా ఓ కారు కొనుగోలు చేశారు. దాని ధర తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే. ఈ కారు చాలా ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. బహుశా దేశంలో అత్యంత ఖరీదైన కార్లలో ఇది ఒకటి అయి ఉంటుంది. ప్రపంచంలోనే విలాసవంతమైన కార్లు తయారు చేసే రోల్స్ రోయ్స్ కంపెనీ కారు "కల్లినాన్ (Cullinan)" అనే కారును కొనుగోలు చేశారు. దీని ధర అక్షరాల రూ.13.14 కోట్లు. ఈ కారును విదేశాల నుంచి ఆర్డర్ పై ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ కారు రిజిస్ట్రేషన్ జనవరి 31న దక్షిణ ముంబైలోని టార్డియో ప్రాంతీయ రవాణా కార్యాలయంలో చేశారు. వాస్తవానికి ఈ కారు ధర రూ. 6.95 కోట్లు కానీ మార్పులు చేర్పులు చేయడంతో ధర రెట్టింపై రూ.13.14 కోట్లకు చేరింది. ఈ కారు ధర చూసి ఆర్టీఓ అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. ఇప్పటివరకు ఇంత ఖరీదైన కారుని రిజిస్ట్రేషన్ చేసిన దాఖలాలు లేవని అధికారులు తెలిపారు. కారు రోడ్డు ట్యాక్సే ఏకంగా రూ.20 లక్షలు ఉంది. అదనంగా రోడ్ సేఫ్టీ టాక్స్ మరో రూ.40 వేలు కూడా రిలయన్స్ ప్రతినిధులు చెల్లించారు.

ముకేశ్ అంబానీ తన వ్యక్తిగత కారులన్నింటికీ ఒకటో నెంబర్(VIP Number) రిజిస్ట్రేషన్ ప్లేట్ ఉండేలా చూసుకుంటారు. అందుకోసం ఆర్టీఓకు ఎంత వెచ్చించైనా ఆ నెంబర్ ని సొంతం చేసుకుంటారు. ఇక కొత్తగా కొన్న ఈ కారుకి కూడా ఒకటో నెంబర్ వచ్చేలా రిజిస్ట్రేషన్ చేశారు. అందుకోసం రూ.12 లక్షల రూపాయలు ఆర్టీఓకి చెల్లించారు. ఈ కారు 6749సీసీ సామర్ధ్యంతో V12 ఇంజిన్ తో వస్తుంది. 563 bhp పవర్ ను 850 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

Rama Rao

Rama Rao

Next Story