Ration Card: రేషన్‌కార్డు దారులకి అలర్ట్‌.. ఈ పనిచేయకపోతే రేషన్ కట్‌..!

Ration Card: మీకు రేషన్ కార్డ్ ఉంటే ఈ వార్త మీ కోసమే. వాస్తవానికి, 'వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్'పై ప్రభుత్వం తరపున పని జరుగుతోంది.

Arun Chilukuri
Updated on: 26 April 2022 8:30 PM IST
Ration Card Holders Alert Link Your Ration Card With Aadhaar to get Ration
X

Ration Card: రేషన్‌కార్డు దారులకి అలర్ట్‌.. ఈ పనిచేయకపోతే రేషన్ కట్‌..!

Ration Card: మీకు రేషన్ కార్డ్ ఉంటే ఈ వార్త మీ కోసమే. వాస్తవానికి, 'వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్'పై ప్రభుత్వం తరపున పని జరుగుతోంది. దీని కింద మీరు ఏ రాష్ట్రంలోని ఏ దుకాణం నుంచి అయినా రేషన్ పొందగలరు. ఇందుకోసం లబ్ధిదారులు తమ రేషన్‌కార్డు, ఆధార్‌ను అనుసంధానం చేయాల్సి ఉంటుంది. మీరు ఇంకా మీ రేషన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయకపోతే భవిష్యత్తులో సమస్యలు రావచ్చు.

దీని కోసం మీరు సకాలంలో ఆధార్, రేషన్‌ను లింక్ చేయడం అవసరం. దీనికి ముందుగా ప్రభుత్వం మార్చి 31 వరకు గడువు విధించింది. అయితే ఇప్పుడు ఆధార్‌ను లింక్ చేసే తేదీని జూన్ 30 వరకు పొడిగించారు. రేషన్ కార్డు లబ్ధిదారులకు తక్కువ ధరకే రేషన్ అందడమే కాకుండా మరెన్నో ప్రయోజనాలు లభిస్తాయి. 'వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్' పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. దీని కింద లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. మీరు రేషన్ కార్డ్‌తో ఆధార్‌ను లింక్ చేయడం ద్వారా ఈ పథకం ప్రయోజనాన్ని పొందవచ్చు.

రేషన్ కార్డును ఆధార్‌తో ఎలా లింక్ చేయాలి

1. ముందుగా ఆధార్ వెబ్‌సైట్ uidai.gov.in కి వెళ్లండి.

2. ఇక్కడ 'Start Now'పై క్లిక్ చేయండి.

3. ఇక్కడ మీ చిరునామా, జిల్లా మొదలైన వివరాలను నింపండి.

4. తర్వాత 'రేషన్ కార్డ్ బెనిఫిట్' ఎంపికపై క్లిక్ చేయండి.

5. ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నంబర్, రేషన్ కార్డ్ నంబర్, ఈ-మెయిల్ అడ్రస్, మొబైల్ నంబర్ మొదలైనవాటిని ఎంటర్‌ చేయండి.

6. తర్వాత, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి OTP వస్తుంది.

7. మీరు OTPని నమోదు చేసిన వెంటనే మీ స్క్రీన్‌పై ప్రక్రియ పూర్తయినట్లు సందేశం వస్తుంది.

8. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత, మీ ఆధార్ ధృవీకరించండి. ఆధార్‌, రేషన్‌ కార్డులను అనుసంధానం చేస్తారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story