Alert: రేషన్‌కార్డు దారులకి గమనిక.. ఈ పనిచేయకపోతే రేషన్‌ బంద్‌..!

Ration Card Holders Alert Link the Ration Card by Aadhaar by June 30
x

Alert: రేషన్‌కార్డు కార్డుదారులకి గమనిక.. ఈ పనిచేయకపోతే రేషన్‌ బంద్‌..!

Highlights

Alert: మీరు రేషన్ కార్డ్ హోల్డర్ అయితే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.

Alert: మీరు రేషన్ కార్డ్ హోల్డర్ అయితే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఇప్పటి వరకు మీ రేషన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయకుంటే వెంటనే చేయండి. లేదంటే రేషన్‌ కట్‌ అవుతుంది. రేషన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయడానికి చివరి తేదీ జూన్ 30గా నిర్ణయించారు. వాస్తవానికి రేషన్ కార్డును ఆధార్‌తో అనుసంధానించడానికి చివరి తేదీ మార్చి 31 కానీ కేంద్ర ప్రభుత్వం దానిని జూన్ 30 వరకు పొడిగించి లబ్ధిదారులకు మరో అవకాశం కల్పించింది.

రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి తక్కువ ధరకే రేషన్ అందుతుంది. కేంద్ర ప్రభుత్వం 'వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్' పథకం కింద దేశంలోని లక్షలాది మంది ప్రయోజనం పొందుతున్నారు. రేషన్ కార్డుతో అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మీరు రేషన్ కార్డ్‌తో ఆధార్ కార్డును లింక్ చేయడం వల్ల 'వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్' పథకం కింద దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా రేషన్ పొందవచ్చు. మీరు ఇంట్లో కూర్చొని ఆధార్‌తో రేషన్‌ను ఎలా లింక్ చేయాలో తెలుసుకుందాం.

ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డ్ లింక్ చేయడం ఎలా?

1. ముందుగా మీరు ఆధార్ అధికారిక వెబ్‌సైట్ uidai.gov.inకి వెళ్లండి.

2. ఇప్పుడు 'Start Now'పై క్లిక్ చేయండి.

3. ఇప్పుడు మీ చిరునామాను జిల్లా రాష్ట్రంతో నింపండి.

4. ఇప్పుడు 'రేషన్ కార్డ్ బెనిఫిట్' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

5. ఇప్పుడు ఆధార్ కార్డ్ నంబర్, రేషన్ కార్డ్ నంబర్, ఈ-మెయిల్ చిరునామా, మొబైల్ నంబర్ ఎంటర్‌ చేయండి.

6. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి OTP వస్తుంది.

7. తర్వాత OTPని ఎంటర్‌ చేసిన వెంటనే స్క్రీన్‌పై ప్రక్రియ పూర్తి మెస్సేజ్‌ పొందుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories