Ratan Tata: రతన్‌ టాటాకు తొలి ‘ఉద్యోగరత్న’ అవార్డు

Ratan Tata: అవార్డును ప్రధానం చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం

Shekhar G
Published on: 20 Aug 2023 9:50 AM IST
Ratan Tata Conferred With Maharashtra Govt Udyog Ratna Award
X

Ratan Tata: రతన్‌ టాటాకు తొలి ‘ఉద్యోగరత్న’ అవార్డు

Ratan Tata: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు మహారాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగరత్న అవార్డు ఇచ్చి సత్కరించింది. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ చేతుల మీదుగా ఉద్యోగ రత్న అవార్డును ప్రధానం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలి ఉద్యోగరత్న అవార్డు రతన్ టాటాను వరించింది. రతన్‌ టాటా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండగా ఇంటి వద్దనే అవార్డును సీఎం అందజేశారు. అవార్డుతో పాటు మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుండి శాలువా, ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందజేశారు.

రతన్‌ టాటా, టాటా గ్రూప్స్‌ దేశానికి ఎనలేని సేవలందించారని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డును స్వీకరించిన రతన్‌ టాటాకు ధన్యవాదాలు తెలిపారు. అన్ని రంగాల్లోను టాటా గ్రూప్ విస్తరించిందని ఎన్నో వేలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story