logo
జాతీయం

వ్యవసాయం చేసుకుంటా..పెరోల్ ఇవ్వండి

వ్యవసాయం చేసుకుంటా..పెరోల్ ఇవ్వండి
X
Highlights

తనను తాను దైవ స్వరూపుడిగా చిత్రీకరించుకుని ప్రస్తుతం జైలుశిక్ష అనుభవిస్తున్న డేరా బాబాకు వ్యవసాయం మీద గాలి...

తనను తాను దైవ స్వరూపుడిగా చిత్రీకరించుకుని ప్రస్తుతం జైలుశిక్ష అనుభవిస్తున్న డేరా బాబాకు వ్యవసాయం మీద గాలి మళ్లినట్లుంది. వివిధ కేసుల్లో దోషిగా తేలడంతో గుర్మిత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ జీవితఖైదు అనుభవిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అతను పెరోల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆశ్రమం కోసం వ్యవసాయం చేసుకుంటానని తనకు పెరోల్‌ ఇప్పించాల్సిందిగా దరఖాస్తులో కోరాడు. అయితే ఆ దరఖాస్తులో డేరా బాబా చెప్పిన విషయాలే ఆశ్చర్యకరంగా ఉన్నాయి. అతను చేసినవి క్షమించరాని నేరాలేం కావట..పైగా జైలులో కూడా సత్ప్రవర్తనతో మెలుగుతోన్నా కాబట్టి తాను పెరోల్‌కు అర్హుడినేని తనకు తానే సర్టిపై చేసుకున్నాడు. సిర్సా జైలు యాజమాన్యం ప్రస్తుతం ఈ దరఖాస్తును పరిశీలిస్తోంది. తన ఆశ్రమంలో పనిచేసే ఇద్దరు మహిళలపై అత్యాచారం చేశాడని రుజువు కావడంతో డేరా బాబా ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.

Next Story