మీకో న్యాయం మాకో న్యాయమా : పోలీసు వాహనాన్ని అడ్డుకున్న ప్రజలు

మీకో న్యాయం మాకో న్యాయమా : పోలీసు వాహనాన్ని అడ్డుకున్న ప్రజలు
x
Highlights

రూల్స్ ఈజ్ రూల్స్ అంటారు చట్టానికి ఎవరు చుట్టం కాదని అంటారు . మరి ఇదెక్కడి న్యాయంమని జార్ఖండ్ లోని కొందరు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా...

రూల్స్ ఈజ్ రూల్స్ అంటారు చట్టానికి ఎవరు చుట్టం కాదని అంటారు . మరి ఇదెక్కడి న్యాయంమని జార్ఖండ్ లోని కొందరు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వచ్చిన ట్రాఫిక్ నిబంధనలతో ప్రజలు అసంతృప్తితో ఉన్నారు . ఈ నేపధ్యంలో కారు సీటు బెల్టు పెట్టుకోకుండా వాహనాన్ని నడుపుతున్న పోలిస్ వాహనాన్ని కొందరు ప్రజలు అడ్డుకున్నారు. ట్రాఫిక్ నిభందనలు అతిక్రమించారని కొందరు వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధిస్తున్నారు ఈ క్రమంలో పీసీఆర్ వాహనం అటు వైపుగా వచ్చింది .

ఈ వాహనంలో డ్రైవర్ అతని పక్కన కూర్చున్న పోలీస్ అధికారి సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ప్రయాణించడాన్ని వాహనదారులు చూశారు. దీనితో అ వాహనాన్ని చుట్టుముట్టి సీటు బెల్టు పెట్టుకోనందుకు డబ్బులు కట్టాల్సిందేనని ధర్నాకి దిగారు . దీనిపై ట్రాఫిక్ పోలీసులకు ఫోన్ చేసి మరి విషయాన్ని వివరించారు . ట్రాఫిక్ పోలీసులు వారికీ జరిమానా విధించాలని కోరారు . దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . మరి ట్రాఫిక్ పోలీసులు వారికీ జరిమానా విధించారా లేదా అన్నది తెలియదు ..


Show Full Article
Print Article
Next Story
More Stories