
రామకృష్ణ పరమహంస గురువుగా ధ్యానిస్తూ స్వామి వివేకానంద స్పూర్తి మార్గంలో రామకృష్ణ మఠం నిర్వహకులు మానవ వనరులను దేశానికి అందించేందుకు నిరంతరం కృషి చేస్తుంది.
రామకృష్ణ పరమహంస గురువుగా ధ్యానిస్తూ స్వామి వివేకానంద స్పూర్తి మార్గంలో రామకృష్ణ మఠం నిర్వహకులు మానవ వనరులను దేశానికి అందించేందుకు నిరంతరం కృషి చేస్తుంది. అందులో భాగంగా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ , పర్సనాలిటీ డెవలప్మెంట్ శిక్షణనిస్తూ యువతను చైతన్య పరుస్తూ సన్మార్గం వైపు నడిపిస్తుంది.
అందులో భాగంగా రామకృష్ణ మఠంలోని వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సెలెన్స్ క్లాసులు నిర్వహిస్తుంది. మనిషి ఏకాగ్రత కోల్పోకుండా ఉండడం సామర్థ్యాన్ని తెలుసుకోవడం ఏలా అనే దానిపై శిక్షణ తరగతులు నిర్వహిస్తుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం, ఆలోచనలు కంట్రోల్ చేసుకోవడం వంటి వాటి మీద శిక్షణ ఇస్తారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ఉన్న రామకృష్ట మఠంలో ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తారు.
ఈ శిక్షణ తరగతులు డిసెంబర్ 2 నుంచి 6 వరకు ఉంటుంది. 18 నుంచి 40 ఏళ్ల వయస్సు వారికి ప్రవేశం ఉంటుంది. సాయంత్రం 6.30 గంటలనుంచి 7.30 గంటల వరకు నిర్వహిస్తారు. మొత్తం ఐదు రోజుల పాటు శిక్షణా తరగతులు జరుగుతాయి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




