రాఖీ సావంత్ కావాలంటారేమో.. సెటైర్ వేసిన హేమా మాలిని..

Hema Malini: వచ్చే ఎన్నికల్లో యూపీలో మధుర లోక్‌సభ నుంచి నటి కంగనా రనౌత్ పోటీ చేస్తారనే ఊహాగానాలపై బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హేమ మాలిని స్పందించారు.

Arun Chilukuri
Updated on: 24 Sept 2022 7:30 PM IST
Rakhi Sawant Next Hema Malini On Kangana Ranaut Election Query
X

రాఖీ సావంత్ కావాలంటారేమో.. సెటైర్ వేసిన హేమా మాలిని..

Hema Malini: వచ్చే ఎన్నికల్లో యూపీలో మధుర లోక్‌సభ నుంచి నటి కంగనా రనౌత్ పోటీ చేస్తారనే ఊహాగానాలపై బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హేమ మాలిని స్పందించారు. కంగానా ఇక్కడి నుంచి పోటీ చేస్తారా అనే మీడియా ప్రతినిధుల ప్రశ్నకు బాగుంది..బాగుంది అంటూ ఆమె రియాక్టయ్యారు. మధురకు సినిమా తారలు మాత్రమే కావాలా అంటూ ఆమె ఎదురు ప్రశ్నించారు. రేపు రాఖీ సావంత్ కూడా పోటీకి రెడీ అవుతారని ఆమె సెటైర్ వేశారు. ఇవాళ సిట్టింగ్ ఎంపీగా హేమమాలిని మధుర నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా దివ్యాంగులకు పరికరాలు పంపిణీ చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story