Rajasthan: రాజ్ పుత్ కర్ణిసేన చీఫ్ దారుణ హత్య.. తుపాకీతో కాల్చి చంపిన దుండగులు

Rajasthan: చికిత్స పొందుతూయ సుఖ్‌దేవ్ సింగ్ మృతి

Shekhar G
Published on: 5 Dec 2023 4:45 PM IST
Rajput Karni Sena Chief Brutally Murdered At His Residence
X

Rajasthan: రాజ్ పుత్ కర్ణిసేన చీఫ్ దారుణ హత్య.. తుపాకీతో కాల్చి చంపిన దుండగులు

Rajasthan: రాష్ట్రీయ రాజపుత్ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్ దేవ్ సింగ్ గోగమేడి దారుణ హత్యకు గురయ్యారు. రాజస్థాన్ జైపూర్ లోని శ్యామ్ నగర్ లో ఆయన ఇంట్లో ఉండగా మంగళవారం దుండగులు బైక్ పై వచ్చి కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ కాల్పుల్లో ఆయన భద్రతా సిబ్బంది, మరొకరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. సుఖ్ దేవ్ నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. దుండగుల కోసం గాలింపు చేపట్టామని జైపూర్ పోలీస్ కమిషనర్ బిజు జార్జ్ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఆయన హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. ఈ ఘటనతో స్థానికంగా ఆందోళన నెలకొనగా, ఆయన కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

Shekhar G

Shekhar G

Next Story