ఉత్తరాఖండ్‌లో రాజ్‌నాథ్ సింగ్ ఎన్నికల ప్రచారం

Uttarakhand: దేశంలో రాష్ట్రంలోనూ బీజేపీ అవినీతి రహిత పాలన అందిస్తోంది.

Sriveni Erugu
Published on: 12 Feb 2022 9:06 AM IST
Rajnath Singhs Election Campaign in Uttarakhand
X

ఉత్తరాఖండ్‌లో రాజ్‌నాథ్ సింగ్ ఎన్నికల ప్రచారం

Uttarakhand: దేశంలో.. రాష్ట్రంలోనూ బీజేపీ అవినీతి రహిత పాలనను అందిస్తోందన్నారు కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌. విశ్వసనీయతే తమ పార్టీకి అతి పెద్ద బలమన్న ఆయన.. ఉత్తరాఖండ్‌లో అభివృద్ధి కొనసాగించేందుకు బీజేపీకి మళ్లీ ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఘన్సాలీ, కర్ణప్రయాగ్‌లలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీల్లో రాజ్‌నాథ్‌ ప్రసంగించారు. అటల్‌ బిహారీ వాజ్‌పేయీ హయాంలో, నరేంద్ర మోడీ హయాంలోనూ దేశానికి రెండుసార్లు అవినీతి రహిత ప్రభుత్వాలను అందించిన ఘనత బీజేపీదేనన్నారు. అలాగే, ఉత్తరాఖండ్‌లోనూ క్లీన్‌ ప్రభుత్వాలను ఇచ్చిందన్నారు. తమ పార్టీ అభ్యర్థులకు అవినీతి మరకలేదన్నారు రాజ్‌నాథ్ సింగ్.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story