భారత సైన్యానికి అత్యాధునిక ఆయుధాలు

Rajnath Singh Hands Over Homegrown Equipment to Army
x

భారత సైన్యానికి అత్యాధునిక ఆయుధాలు

Highlights

Rajnath Singh: పాంగాంగ్ లేక్‎లో పోరాటానికి ఉపయుక్తమైన ఆయుధాలు

Rajnath Singh: భారత సైన్యానికి అత్యాధునిక ఆయుధాలను రక్షణ మంత్రి రాజ్‎నాథ్ సింగ్ అప్పగించారు. చైనాతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న పాంగాంగ్ సరస్సు పరిసరాల్లో మోహరించడానికి, సైనిక సామర్థ్యాన్ని పెంచడానికి ఈ అత్యాధునిక ఆయుధాలను కట్టబెట్టారు. వాటిలో నిపుణ్ అనే యాంటీ పర్సనల్ ల్యాండ్ మైన్, ల్యాండింగ్ క్రాఫ్ట్ వంటి కీలకమైన సైనిక సంపత్తి ఉన్నాయి. మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా ఈ అత్యాధునిక పరికరాలు సైనికుల అవసరాలను ఎంతో మెరుగ్గా తీరుస్తాయి. హిమాలయాల్లో చైనాతో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న క్రమంలో ఈ ఆయుధ పరికరాలు ఎంతో ఉపయోగపడతాయంటున్నారు. ఒక్కో ఆయుధం, పరికరం పనితీరును సైనిక నిపుణులు రాజ్‎నాథ్‎కు వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories