రాజస్థాన్​ అసెంబ్లీలో హైడ్రామా.. పాత బడ్జెట్‌ను చదివిన సీఎం అశోక్​ గెహ్లోత్

Rajasthan CM Ashok Gehlot Read old Budget Speech in Assembly
x

రాజస్థాన్​ అసెంబ్లీలో హైడ్రామా.. పాత బడ్జెట్‌ను చదివిన సీఎం అశోక్​గెహ్లోత్

Highlights

Ashok Gehlot: సభకు క్షమాపణ కోరిన ముఖ్యమంత్రి అశోక్

Ashok Gehlot:: రాజస్థాన్ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ 2023-24 బడ్జెట్‌కు బదులుగా గతేడాది బడ్జెట్ సారాంశాన్ని చదివారని ప్రతిపక్షాలు ఆరోపించారు. విపక్ష సభ్యులు ఒక్కసారిగా వెల్‌లోకి దూసుకొచ్చి తీవ్రస్థాయిలో నినాదాలు చేశారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాది చివర్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్. దీంతో సీఎం గెహ్లోత్ దాదాపు 8 నిమిషాల పాటు బడ్జెట్‌ను చదివారు. అయితే ఇది గతేడాది బడ్జెట్ కాపీ అని గుర్తించిన చీఫ్ విప్..ఆ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెంటనే సీఎం బడ్జెట్ కాపీని చదవడం ఆపేసి క్షమాపణ కోరారు. అందుకు విపక్ష సభ్యులు అంగీకరించకపోవడంతో వారిపై స్పీకర్ సీపీ జోషీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభను అరగంటపాటు వాయిదా వేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories