ఉదయ్‌పూర్‌లో హత్యకు గురైన కన్హయ్య కొడుకులకు ప్రభుత్వ ఉద్యోగాలు

Rajasthan: ఉదయ్‌పూర్‌లో దుండగుల చేతిలో హత్యకు గురైన టైలర్ కన్హయ్య కొడుకులకు ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు రాజస్థాన్ సర్కార్ ప్రకటించింది.

Arun Chilukuri
Updated on: 7 July 2022 8:30 PM IST
Rajasthan Announces Government Jobs For Sons Of Tailor Kanhaiya Lal
X

ఉదయ్‌పూర్‌లో హత్యకు గురైన కన్హయ్య కొడుకులకు ప్రభుత్వ ఉద్యోగాలు

Rajasthan: ఉదయ్‌పూర్‌లో దుండగుల చేతిలో హత్యకు గురైన టైలర్ కన్హయ్య కొడుకులకు ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు రాజస్థాన్ సర్కార్ ప్రకటించింది. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మకు కన్హయ్య మద్దతు పలికారు. దీంతో దుండగులు కన్హయ్యను గత నెల 28న దుండగులు దారుణంగా హత్య చేశారు. -

ఈ నేపథ్యంలో ఆయన కుమారులైన యష్ తేలి, తరుణ్ తేలిలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని రాజస్థాన్ ప్రభుత్వం తెలిపింది. కన్హ‍య్య సంపాదనపైనే అతని కుటుంబం ఆధారపడి ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తెలిపారు. దేశవ్యాప్తంగా మతపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత సమయంలో ప్ర‌ధాని జోక్యం చేసుకుని శాంతి సందేశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story