logo
జాతీయం

అన్న రాజీనామా.. 'జాగ్రత్త' అంటూ షిండేకు రెండు సూచనలు చేసిన రాజ్ థాకరే

Raj Thackeray 2 Suggestions to Maharashtra CM Eknath Shinde
X

అన్న రాజీనామా.. 'జాగ్రత్త' అంటూ షిండేకు రెండు సూచనలు చేసిన రాజ్ థాకరే

Highlights

Raj Thackeray: మహారాష్ట్ర సీఎం ఏక్‎నాథ్ షిండేకు మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సోదరుడు రాజ్ థాకరే శుభాకాంక్షలు చెప్పారు.

Raj Thackeray: మహారాష్ట్ర సీఎం ఏక్‎నాథ్ షిండేకు మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సోదరుడు రాజ్ థాకరే శుభాకాంక్షలు చెప్పారు. మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత హోదాలో ఆయన షిండేకు 2 సూచనలు చేశారు. మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం తమకు ఆనందం కలిగించిందని, ఈ అవకాశాన్ని సమర్థతతో వ్యవహరించి సద్వినియోగం చేయాలని, అత్యంత జాగ్రత్తగా అడుగులు వేయాలని రాజ్ థాకరే సూచించారు. మరోవైపు ఉద్ధవ్ పేరు ప్రస్తావించకుండా చేసిన మరో ట్వీట్ కూడా వైరల్ అవుతోంది.

ఒక వ్య‌క్తి త‌న అదృష్టాన్ని సొంత విజ‌యంగా ఎప్పుడు భావించడం ప్రారంభిస్తాడో ఆనాటి నుంచే అత‌ని ప‌త‌నం మొదల‌వుతుందని ట్వీట్ చేశారు. సీఎం పదవి కోసం బీజేపీకి దూరమై కాంగ్రెస్, ఎన్సీపీలతో చేతులు కలిపి ఉద్ధవ్ అభాసుపాలయ్యాడన్నది అందరూ చర్చించుకుంటున్న అంశమే. ఈ పరిణామాలు ఉద్దేశించే రాజ్ థాకరే ఈ ట్వీట్ చేసినట్టు భావిస్తున్నారు. సంక్షోభ సమయంలో సైలెంట్‎గా ఉన్న రాజ్ షిండే సీఎంగా బాధ్యతలు చేపట్టాక ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. రెబల్ ఎమ్మెల్యేల క్యాంపు సమయంలో కూడా రాజ్ థాకరే షిండేతో మాట్లాడినట్లు ముంబై రాజకీయ నిపుణులు చెప్పుకంటున్నారు.

Web TitleRaj Thackeray 2 Suggestions to Maharashtra CM Eknath Shinde
Next Story