Rahul Gandhi: రాహుల్ గాంధీ కార్యాలయంపై దాడి..

Rahul Gandhi Office: కేరళలోని వాయనాడ్‌లో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కార్యాలయంపై కొందరు వ్యక్తులు దాడి చేశారు.

Arun Chilukuri
Updated on: 24 Jun 2022 9:30 PM IST
Rahul Gandhis Wayanad Office Vandalised
X

Rahul Gandhi: రాహుల్ గాంధీ కార్యాలయంపై దాడి..

Rahul Gandhi Office: కేరళలోని వాయనాడ్‌లో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కార్యాలయంపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. అక్కడి సిబ్బందిని కొట్టడంతో పాటు ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. కల్పేటలోని వాయనాడ్ ‌ఎంపీ రాహుల్‌ గాంధీ కార్యాలయానికి సుమారు 80 మంది SFI కార్యకర్తలు చేరుకొని బలవంతంగా లోపలికి ప్రవేశించారని, సిబ్బందిని దారుణంగా కొట్టారని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ ఆరోపించారు.

ఈ దాడికి కారణమేంటో తమకు తెలియదన్నారు. బఫర్ జోన్ అంశంపై పోరాడుతున్నట్లుగా వారు చెప్పారని దీంతో రాహుల్‌ గాంధీకి సంబంధం ఏంటన్నది అర్థం కాలేదన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేరళ సీఎం మాత్రమే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. దీనిపై జోక్యం చేసుకోవాలంటూ కేరళ సీఎం పినరయ్ విజయన్‌తో పాటు ప్రధాని మోడీకి రాహుల్‌ గాంధీ లేఖ రాసినట్లు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story