Kerala: రాహుల్‌ గాంధీ నా కొడుకు.. నర్సు భావోద్వేగం!

Kerala: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేరళలో పర్యటించారు.

Arun Chilukuri
Published on: 19 Aug 2021 7:49 PM IST
Rahul Gandhi you are my son Says Nurse
X

Kerala: రాహుల్‌ గాంధీ నా కొడుకు.. నర్సు భావోద్వేగం!

Kerala: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేరళలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా రాహుల్ ఒక నర్సును కలిశారు. రాహుల్ గాంధీ పుట్టిన సమయంలో నర్సుగా పనిచేసిన రాజమ్మను కలిశారు. ఆమె ఢిల్లీలోని హోలీ ఫ్యామిలీ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. 1970 జూన్ 19న రాహుల్ గాంధీ జన్మించిన సమయంలో రాజమ్మనే అక్కడే పనిచేస్తున్నారు.

మొదటగా రాహుల్ తన చేతుల్లోకి తీసుకుంది రాజమ్మ అయితే ఇప్పుడు రాహుల్ వయనాడ్ వచ్చారని తెలిసి ఆయన్ను కలిసేందుకు వచ్చారు. రాహుల్ కారులో కూర్చొని ఉండగా అతని వద్దకు వచ్చి రాజమ్మ పలకలించారు. రాహుల్ ను చూసిన వెంటనే అమితానందానికి లోనై ఆయన బాగుండాలని ఆశీర్వదించారు. రాజమ్మ రాహుల్ గాంధీని చూపిస్తూ ఇతను తన కొడుకని పరిచయం చేశారు. లోకం ఎవ్వరు చూడకముందే నేను చూశానంటూ సంబరబడ్డారు. ఈ సందర్భంగా రాజమ్మ రాహుల్ గాంధీకి స్వీట్ బాక్సు బహుకరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story