Rahul Gandhi: యూపీలో హైటెన్షన్, మృతుల కుటుంబాలను పరామర్శించనున్న రాహుల్

Rahul Gandhi - Lakhimpur Kheri Tour: రాహుల్ పర్యటనకు అనుమతి నిరాకరించిన యూపీ సర్కార్

Shireesha
Published on: 6 Oct 2021 11:52 AM IST
Rahul Gandhi Visit to Lakhimpur Kheri Victims in Uttar Pradesh | Telugu Online News
X

Rahul Gandhi: యూపీలో హైటెన్షన్, మృతుల కుటుంబాలను పరామర్శించనున్న రాహుల్

Rahul Gandhi - Lakhimpur Kheri Tour: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ఖేరిలో నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇవాళ లఖింపూర్‌కు కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ వెళ్లనున్నారు. మృతుల కుటుంబాలను రాహుల్ గాంధీ పరామర్శించనున్నారు. అయితే రాహుల్ గాంధీ పర్యటనకు యోగి సర్కార్ అనుమతి నిరాకరించింది.

బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన ప్రియాంకా గాంధీని లఖింపూర్‌ చేరకముందే అడ్డుకున్న పోలీసులు, ఓ గెస్ట్‌హౌస్‌లో నిర్బంధించారు. ఇప్పుడు ఆమెపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రియాంక గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై ఆపార్టీ సీనియర్‌ నేత నవజోత్‌ సింగ్‌ సిద్ధూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రియాంక గాంధీని విడుదల చేయాలని, నిందితులను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే పంజాబ్‌ నుంచి లఖింపూర్‌ వరకు ర్యాలీ నిర్వహిస్తామని యూపీ పోలీసులను హెచ్చరించారు సిద్ధూ.

Shireesha

Shireesha

Next Story