అనర్హత వేటు.. ఇల్లు ఖాళీ చేసి.. అమ్మ ఇంట్లోకి వచ్చిన రాహుల్‌ గాంధీ

Rahul Gandhi Vacating his Residence After Being Disqualified as Lok Sabha MP
x

అనర్హత వేటు.. ఇల్లు ఖాళీ చేసి.. అమ్మ ఇంట్లోకి వచ్చిన రాహుల్‌ గాంధీ

Highlights

Rahul Gandhi: అనర్హత వేటుకు గురైన కారణంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను శుక్రవారం ఖాళీ చేశారు.

Rahul Gandhi: అనర్హత వేటుకు గురైన కారణంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను శుక్రవారం ఖాళీ చేశారు. ఏప్రిల్ 22లోగా ఆయన తన బంగ్లాను ఖాళీ చేయాలని లోక్‌సభ హౌజింగ్ కమిటీ గతంలోనే నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. జన్‌పథ్‌లోని తన తల్లి సోనియాగాంధీ ఇంటికి రాహుల్ షిప్ట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్‌ తన బంగ్లాను ఈరోజు ఖాళీ చేశారు.

దీంతో, ఢిల్లీ 12 తుగ్లక్ లైన్‌లోని ప్రభుత్వ బంగ్లాలో ఉన్న ఆయన సామాన్లను ట్రక్కుల్లో తరలించారు. ఇక, రాహుల్ గాంధీ లోక్‌సభకు వరుసగా నాలుగోసారి ఎన్నికయ్యారు. 2004 ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ తొలిసారిగా అమెథీ నుంచి లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. దీంతో, ఆయనకు ఢిల్లీలోని తుగ్లక్‌ లేన్‌లో బంగ్లాను కేటాయించారు. నాటి నుంచి ఆయన అక్కడే నివాసం ఉంటున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories