బీజేపీ సర్కార్‌పై రాహుల్‌ ఘాటు విమర్శలు.. బీజేపీ అంటే..

Arun Chilukuri
Published on: 5 March 2021 9:06 PM IST
బీజేపీ సర్కార్‌పై రాహుల్‌ ఘాటు విమర్శలు.. బీజేపీ అంటే..
X

బీజేపీ సర్కార్‌పై రాహుల్‌ ఘాటు విమర్శలు.. బీజేపీ అంటే..

బీజేపీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీజేపీ అంటే బర్డన్ జనతా పార్టీ అంటూ ట్విట్టర్ వేదికగా కొత్త నిర్వచనం చెప్పారు. బీజేపీ దోపిడీకి వ్యతిరేకంగా అందరూ గళమెత్తాలని సూచించారు. దేశ హితాన్ని దృష్టిలో పెట్టుకుని, తమతో గొంతు కలపాలని, దేశం మొత్తం కదిలి రావాలని రాహుల్ పిలుపునిచ్చారు. ధరల పెరుగుదల అనేది ఓ శాపమని... పన్నుల కోసం దేశ ప్రజలను కేంద్ర ప్రభుత్వం ఊబిలోకి నెట్టేస్తోందని తీవ్రంగా విమర్శించారాయన. కేంద్ర ప్రభుత్వం దేశాన్ని విధ్వంసం దిశగా తీసుకెళ్తోందని, దానికి వ్యతిరేకంగా అందరూ గళమెత్తాలని రాహుల్‌ అభ్యర్థించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story