మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ 31వ వర్ధంతి.. వీర్‌భూమిలో ఘన నివాళి...

Rajiv Gandhi: *రాహుల్‌ గాంధీ ఎమోషనల్‌ ట్వీట్‌ *తండ్రిని చాలా మిస్‌ అవుతున్నట్టు ట్వీట్‌లో వెల్లడి

Shireesha
Published on: 21 May 2022 1:38 PM IST
Rahul Gandhi Sonia Gandhi Priyanka Gandhi Tribute to Rajiv Gandhi on Death Anniversary | Live News
X

మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ 31వ వర్ధంతి.. వీర్‌భూమిలో ఘన నివాళి...

Rajiv Gandhi: మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ 31 వర్ధంతి సందర్భంగా ఆయనను దేశం స్మరించుకుంది. ఢిల్లీలోని వీర్‌భూమి వద్ద రాజీవ్‌ సమాధి వద్ద కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పార్టీ ముఖ్యనేతలు నివాళులర్పించారు. అదే సమయంలో రాహుల్‌ గాంధీ.. తన తండ్రి రాజీవ్‌గాంధీకి నివాళులర్పిస్తూ.. వీడియోను ట్వీట్‌ చేశారు. తన తండ్రి దార్శినిక నాయకుడని.. ఆధునిక భారతదేశాన్ని రూపొందించడంలో ఆయన విధానాలు ఎంతో సహాయపడ్డాయని తెలిపారు.

రాజీవ్‌ దయగల వ్యక్తి అని.. తనకు, సోదరి ప్రియాంకకు అద్భుతమైన తండ్రని తెలిపారు. తన తండ్రి ని చాలా మిస్‌ అయ్యామని వాపోయారు. కాంగ్రెస్ నేతలు చిదంబరం, సచిన్ పైలట్ కూడా ఢిల్లీలోని వీర్ భూమిలో నివాళులర్పించారు. 1944 ఆగస్టు 20న జన్మించిన రాజీవ్ గాంధీ... 1991 మే 21న తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఎల్‌టీటీఈ ఆత్మహుతి డాడిలో మృతి చెందారు.


Shireesha

Shireesha

Next Story