ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి.. రాజీవ్ గాంధీకి నివాళులర్పిస్తూ ప్రధాని మోడీ ట్వీట్..

Rahul Gandhi, Priyanka pay Tributes to Rajiv Gandhi on 78th Birth Anniversary
x

ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి.. రాజీవ్ గాంధీకి నివాళులర్పిస్తూ ప్రధాని మోడీ ట్వీట్..

Highlights

Rajiv Gandhi 78th Birth Anniversary: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 78వ జయంతి సందర్భంగా వీర్ భూమిలో రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.

Rajiv Gandhi 78th Birth Anniversary: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 78వ జయంతి సందర్భంగా వీర్ భూమిలో రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో రాజీవ్ గాంధీకి నివాళులు తెలియజేస్తూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా రాజీవ్ గాంధీ సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ సేవలను గుర్తు చేసుకున్నారు.

1944 ఆగ‌స్ట్ 20న ముంబైలో రాజీవ్‌ గాంధీ జ‌న్మించారు. 1984 అక్టోబ‌రులో ఆయ‌న దేశ ప్రధానిగా బాధ్యత‌లు చేపట్టారు. అతి చిన్నవ‌య‌సులోనే ప్రధానిగా బాధ్యత‌లు స్వీక‌రించి రాజీవ్ సరికొత్త రికార్డు సృష్టించారు. 1989 డిసెంబ‌ర్ 2 వ‌ర‌కూ ప్రధానిగా ఉన్నారు. 1991 మేలో త‌మిళనా‌డులోని శ్రీపెరంబుదూర్‌లో జ‌రిగిన ఎన్నిక‌ల ర్యాలీలో LTTE జ‌రిపిన ఆత్మాహుతి దాడిలో రాజీవ్ గాందీ మృతి చెందారు. ఈ రోజును కాంగ్రెస్ పార్టీ స‌ద్భావ‌న దివస్‌గా పాటిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories