పుదుచ్చేరి ఎన్నికలే లక్ష్యంగా రాహుల్ పర్యటన..

Arun Chilukuri
Published on: 17 Feb 2021 5:44 PM IST
పుదుచ్చేరి ఎన్నికలే లక్ష్యంగా రాహుల్ పర్యటన..
X

పుదుచ్చేరి ఎన్నికలే లక్ష్యంగా రాహుల్ పర్యటన..

కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్ గాంధీ పుదుచ్చేరిలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా రాహుల్ రంగ ప్రవేశం చేశారు. మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కారమయ్యేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాహుల్ కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేశారు. చిన్నవ్యాపారస్థులను కేంద్ర ప్రభుత్వం టార్గెట్‌ చేస్తోందని పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకే కేంద్రం మద్దతుగా నిలుస్తోందని ఆరోపించారు. మత్స్యకారుల సమస్యలు పరిష్కరించేందుకు మోడీ ప్రభుత్వం కేంద్ర మత్స్యశాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకూ మత్స్యశాఖను ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story