Lok Sabha: మరణించిన రైతు కుటుంబాలకు పరిహారానికి రాహుల్ డిమాండ్

Lok Sabha: ఉద్యమంలో మరణించిన రైతులకు నష్టపరిహారం ఇచ్చి తీరాల్సిందేనని కాంగ్రెస్ నేత రాహుల్ మరోసారి కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

Arun Chilukuri
Published on: 7 Dec 2021 3:50 PM IST
Rahul Gandhi Gives Adjournment Motion Notice in Lok Sabha
X

Lok Sabha: మరణించిన రైతు కుటుంబాలకు పరిహారానికి రాహుల్ డిమాండ్

Lok Sabha: ఉద్యమంలో మరణించిన రైతులకు నష్టపరిహారం ఇచ్చి తీరాల్సిందేనని కాంగ్రెస్ నేత రాహుల్ మరోసారి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. లోక్‌సభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టిన రాహుల్ ఉద్యమంలో మరణించిన ప్రతి రైతు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సాగు చట్టాలపై ప్రధాని మోడీ తన తప్పు తెలుసుకుని క్షమాపణలు చెప్పారని, వ్యవసాయ మంత్రి మాత్రం మరణించిన రైతుల డేటా లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రైతు కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం ఇచ్చి పంజాబ్ సర్కార్ ఆదుకుందని, ఇప్పటికైనా బీజేపీ సర్కార్ ఆ దిశగా అడుగులు వేయాలని రాహుల్ డిమాండ్ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story