ప్రధాని మోడీపై రాహుల్ ఫైర్.. హిందూ జాతీయవాదం పదాన్ని అంగీకరించం...

Rahul Gandhi: ప్రధాని మోడీ విజన్ లో కేవలం కొంతమంది మాత్రమే స్థానం...

Shireesha
Published on: 25 May 2022 10:01 AM IST
Rahul gandhi Fires in Pm Narendra Modi about Hindutva Nationalism | Live News
X

ప్రధాని మోడీపై రాహుల్ ఫైర్.. హిందూ జాతీయవాదం పదాన్ని అంగీకరించం...

Rahul Gandhi: భారత ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి నిప్పులు చెరిగారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. లండన్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ.. భారత్ లో సమస్యలను ఎత్తిచూపే సంస్థలను క్రమంగా అణచివేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పార్లమెంట్, ఎన్నికల వ్యవస్థ సహా ప్రజా స్వామ్య వ్యవస్థను ఓ సంస్థ తన ఆధీనంలోకి తెచ్చుకుందన్నారు. స్వేచ్చగా ప్రశ్నించేందుకు అవకాశం ఉన్నప్పుడే భారత్ సజీవంగా ఉన్నట్లు..అదే మౌనంగా ఉంటే ఇంక అందులో అర్థంలేదు.

పార్లమెంట్, ఎన్నికలు, ప్రజాస్వామ్యం మొదలైన వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయన్నారు. ప్రధాని మోడీ విజన్ లో కేవలం కొంతమంది మాత్రమే ఉంటారు. ఈ వైఖరిని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు రాహుల్ తెలిపారు. హిందూ జాతీయ వాదం అనే పదాన్ని కూడా తాను అంగీకరించనన్నారు. దాడులు, హత్యలకు పాల్పడే వారి సిద్ధాంతాలను హిందుత్వంతో పోల్చడం సరికాదన్నారు.

Shireesha

Shireesha

Next Story