Rahul Gandhi: ఆ నిరుద్యోగం వల్లే పార్లమెంట్‌లో పొగబాంబు ఘటన

Rahul Gandhi: పార్లమెంట్ బయట రాహుల్ వీడియో తీశారని చెబుతారు కానీ.. దేశంలో నిరుద్యోగం పెరుగుతోందని మాత్రం చెప్పరు

Jyothi
Published on: 22 Dec 2023 2:04 PM IST
Rahul Gandhi Fire On Central Govt
X

Rahul Gandhi: ఆ నిరుద్యోగం వల్లే పార్లమెంట్‌లో పొగబాంబు ఘటన

Rahul Gandhi: ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఇండియా కూటమి చేపట్టన సేవ్ డెమోక్రసీ ధర్నాలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్లమెంట్‌లో భద్రతా లోపాన్ని లేవనెత్తిన రాహుల్ గాంధీ.. భద్రతా లోపంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే సమాధానం చెప్పాని ఆయన డిమాండ్ చేశారు. ఆరు రోజుల క్రితం కొంత మంది యువకులు పార్లమెంట్‌లోకి ప్రవేశించి పొగను విడుదల చేశారు.. దీంతో బీజేపీ ఎంపీలంతా పారిపోయి ఊపిరి పీల్చుకున్నారు అని రాహుల్ గాంధీ చమత్కరించారు.

ఆ యువత ఎందుకు ఈ నిరసన చేశారని కూడా ప్రశ్నించారు..? దీనికి కారణం నిరుద్యోగమేనంటూ ఆయన విమర్శించారు. దేశంలో తీవ్ర స్థాయిలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. యువతకు ఉపాధి లభించకపోవడం వల్లే పార్లమెంట్‌లో శాంతి భద్రతలకు విఘాతం కల్పించారని రాహుల్ గాంధీ వెల్లడించారు.

Jyothi

Jyothi

Next Story